J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ , లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.


శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక బ్రహ్మ పుష్కరిణి లో స్వామివారి ఉత్సవ మూర్తులు బల్లకట్టు హంస వాహనం పై ఉంచి. నీటిలో ఐదు ప్రదక్షిణాలు. నిర్వహించారు. వేలాది మంది భక్తజనం ఏ ఉత్సవాన్ని కనులారా తిలకించారు.
అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను మంటపంలో. డోలోత్సవం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా. ఆలయ అధికారులు,. పాలకవర్గ సభ్యులు, పోలీస్ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేశారు. తాగునీటి వసతి సౌకర్యం, భక్తులకు టీటీడీలో ఉచిత అన్నదానం, గాయత్రి నిత్య అన్నదాన సత్రం వారు ఉచిత పులిహోర పంపిణీ చేశారు.
👉నిజాంబాద్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో భక్తులు

డోలోత్సవం తెప్పోత్సవం తిలకించడానికి శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తజనం తరలివచ్చారు. ఆర్మూర్, జగిత్యాల డిపోల మేనేజర్ లు రవికుమార్, సునీత ధర్మపురి బస్ స్టాండ్ లో మకాం వేసి భక్తులు ఇబ్బంది పడకుండా రాకపోకలను క్రమబద్ధీకరించారు.

👉ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు !

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడానికి భక్తజనంతో ఆలయ ప్రాంగణం వీధుల లో భక్తజనం పోటెత్తింది. స్థానిక ఇసుక స్తంభం వరకు భక్తుల క్యూ లైన్ ఏర్పడింది. పాలకవర్గ సభ్యులు, పోలీసులు, అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

👉త్యాగరాజు ఉత్సవాలు ఆరంభం!

ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదిక పై శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు వేదమంత్రాలతో నగర సంకీర్తనతో, వేదమంత్రాలు ఘోషతో ప్రారంభించారు.