👉 ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రసిద్ధ ప్రాచీన పుణ్యక్షేత్రంలో కొలువైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి శాశ్వత కళ్యాణ మంటప నిర్మాణానికి శక్తుల కృషి చేస్తానని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో శేషప్ప కళావేదికపై నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొని నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు.
👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
స్వామివారి అనుమతితో శ్రీ మఠం మైదానంలో ఇటీవల బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగడంతో పాటు వేలాది మంది భక్తులు ఎలాంటి తోక్కిసలాట జరగకుండా భక్తజనం తిలకించారు అని ఎమ్మెల్యే అన్నారు.
భక్తుల స్థానికుల అభిప్రాయం మేరకు కళ్యాణమంటప నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డిని నిధులు మంజూరుకు విజ్ఞప్తి చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

అనంతరం పలువురు పండితులను, మరియు వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖులను ఆలయ అధికారులు, దేవాలయ పాలకవర్గం చైర్మెన్ జక్కు రవీందర్ తో కలిసి వారిని సన్మానించారు.

అనంతరం టీవీ5 హిందూ ధర్మం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన తెలుగు సంవత్సరాది పంచాంగాన్ని ఆవిష్కరించారు.
👉 సన్మాన గ్రహీతలు..,,

పెండ్యాల చంద్రశేఖర్ శర్మ (వేదం),

పెద్ది భరత్ (సాహిత్యం),

బుగ్గారపు నరహరి (నాటక రంగం),

డాక్టర్ గుండి శ్రీనివాస్ శర్మ (సాహిత్యం),

కాకెరి అమర్ (పురాణం),

శ్రీమతి పాలెపు లక్ష్మీ నరహరి (జ్యోతిష్యం)

మరియు వంశపార్యంపర ఆలయ పంచాంగ ప్రవచనకర్త బుగ్గారవు రాజేంద్రప్రసాద్,లను దేవస్థానము వారి తరుపున ఉగాది పురస్కారము అందజేసి సత్కారము చేశారు.
👉 రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే !

బుగ్గారం మండలం చందయ్య పల్లె గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు.