ధర్మపురి రథోత్సవంలో జేబుదొంగ పట్టివేత ?


J.SURENDER KUMAR


ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం సందర్భంగా స్థానిక పోలీసులు డేగ కన్ను పహారా ఏర్పాటు చేశారు. ఓ భక్తుడి జేబు నుంచి డబ్బులు దొంగలిస్తుండగా మఫ్టీ కానిస్టేబుల్ దొంగను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.


బుధవారం స్వామి వారి రథోత్సవం తిలకించడానికి తరలివచ్చిన భక్తజనంతో ధర్మపురి పోటెత్తింది. మఫ్టీ కానిస్టేబుల్ జేబు దొంగను పట్టుకోవడంతో ఆ ముఠాలో కొందరు జన సమూహం నుంచి పారిపోయారు.

దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మేడిశెట్టి సురేందర్ అనే భక్తుడి  డబ్బులు దొంగలిస్తుండగా దొంగ పోలీసులకు చిక్కాడు.  
పట్టుబడిన దొంగను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన దొంగ మంచిర్యాలకు చెందిన వాడిగా సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.