ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం !

J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ పూజా కార్యక్రమం సోమవారం ప్రారంభమయ్యాయి

ఆలయ వేద పండితులు , కార్యనిర్వహణాధికారి, మేళా తాళాలతో  పురుషోత్తంఆచార్యుల, ఇంటికి వెళ్లి బ్రహ్మోత్సవాలు ప్రారంభించాల్సిందిగా ఆలయానికి ఆహ్వానించారు.


ఆచార్యులు రాక తో బ్రహ్మోత్సవాల కలశస్థాపన, పూజాది కార్యక్రమాల తర్వాత స్వామి వారలు, మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, వేదమంత్రాలతో ఊరేగింపుగా వరహ తీర్థం వద్ద కు చేరుకున్నారు. నూతనంగా నిర్మితమైన పుట్ట బంగారు మండప వేదిక ముందు పుట్ట బంగారం పూజాది కార్యక్రమం నిర్వహించారు.


శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ ఊరేగింపు స్థానిక బోయవాడ సమీపాన టీటీడీ ధర్మశాల ఆవరణలో పుట్ట బంగారం పూజాది కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి.