J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామికి దాతలు సోమవారం దాదాపు ₹ 3 లక్షల రూపాయల విలువగల వెండి ఆభరణాలు బహుకరించారు.
మూడు కిలోల బరువు గల వెండి శంఖు చక్రం ముంజేతుల ఆభరణాలు ఆలయ అధికారులకు అప్పగించారు.
ధర్మపురి సింగిల్ విండో మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి దంపతులు , వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్ కుమార్ దంపతులు, మరియు హైదరాబాద్ కి చెందిన వెన్నం రాజేశ్వర్ రెడ్డి దంపతులు కలిసి స్వామి వారికి అభరణాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, ముఖ్య అర్చకుడు నంబి శ్రీనివాసచార్య, నేరెళ్ల వంశీ చార్యులు, భక్తులు పాల్గొన్నారు.