👉 రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర చైర్మన్ అజయ్ మిశ్రా !
👉 దొంతి గ్రామంలో మెగా వైద్య శిబిరం విజయవంతం !
J.SURENDER KUMAR,
గ్రామీణ ప్రాంతాల్లో తమ సంస్థ దాతల సహాయ, సహకారాలతో సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా అన్నారు.
శివంపేట మండలంలోని దొంతి గ్రామంలో తుప్రాన్ వి ఎస్ టి ఇండస్ట్రీస్ సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి అజయ్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.. సేవా కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ముందుండి నడిపించాలని కోరారు. అనంతరం రెడ్ క్రాస్ సోసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగం శ్రీనివాసరావు, జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..

జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, మెగా వైద్య క్యాంపులు, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కాగా దొంతి గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య మెగా క్యాంపుకు అక్కడి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. శివంపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లతోపాటు, మల్లారెడ్డి ఆసుపత్రికి చెందిన డాక్టర్లు, డెంటల్ డాక్టర్లు శిబిరములో పాల్గొని పేషెంట్లకు వైద్య సేవలు అందించారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్, జిల్లా కోశాధికారి డి జి శ్రీనివాస్ శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, మద్దెల సత్యం, దామోదర్ రావు, తోట శ్రీనివాస్, మద్దెల రమేష్, సతీష్, మాజీ జెడ్పిటిసి లక్ష్మీ కాంతారావు, గ్రామ కార్యదర్శి రమేష్, తో పాటు శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, గిరి తదితరులు పాల్గొన్నారు.