హక్కుల రక్షణ కే జై బాపు జై భీమ్ జై సంవిదాన్ !

👉 ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


భారత రాజ్యంగాన్నీ రక్షించాలని, అంబేద్కర్ కల్పించిన హక్కుల ను కాపాడాలనే ఉద్దేశ్యంతో జై బాపు జై భీమ్ జై సంవిదాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టడం జరిగిందని, ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అన్నారు.


జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోనీ స్థానిక ఇందిరాభవన్ లో శనివారం  ఏర్పాటు చేసిన జైబాపు, జై భీమ్, జై సమ్మిదాన్ జిల్లా స్థాయి సన్నాక సమావేశంలో ముఖ్య అతిథిగా  ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మెన్ రియాజ్ . నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు


ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..


సంవిధాన రక్షణ కోసం, హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, జై బాపు జై భీమ్ జై సంవిదాన్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ గ్రామాన తీసుకెళ్ళాలని, భారత సంవిధాన రక్షణ కు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కోరారు.


భారత సంవిధాన రక్షణ అందరి బాధ్యత అని కాంగ్రెస్ పార్టీలో కుల, మత భేదం లేకుండా ఎలాంటి వర్గాలు లేకుండా పార్టీని ముందుకు నడిపించాలని, జాతిపిత మహాత్మాగాంధీ గొప్పతనం, రాజ్యాంగం ఆవశ్యకతలను ప్రజలకు వివరించండమే ముఖ్య లక్ష్యం అని, రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.