J.SURENDER KUMAR,
రాష్ట్రంలో అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి హిందూ ముస్లిం భాయి భాయి గా ఈ జీవనం కొనసాగిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పుకోవచ్చు అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ధర్మారం మండలం మజీద్ లో శనివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
👉 విప్ ను కలిసిన డీఎం !

జగిత్యాల జిల్లా నూతన RTC డిపో మేనేజర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కల్పన రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారినీ జగిత్యాలలోని కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు.
👉 క్రీడాకారిణి కి సన్మానం !

ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి పూజిత పవర్ లిఫ్టింగ్ 76 కేజీల విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో ఎంపికైన సందర్భంగా పూజితను శాసనసభ్యులు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాలువాతో సన్మానించి అభినందించారు. ప్రభుత్వ పరంగా ఎటువంటి అవసరం ఉన్న సహాయ సహకారాలు అందిస్తామని ఈ సంధర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.