J.SURENDER KUMAR,
ధర్మపురి కి చెందిన హోంగార్డు రాములు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ యంత్రాంగానికి అందించిన సేవలు అభినందనీయమని జగిత్యాల ఎస్పి అశోక్ కుమార్ అన్నారు.
రెండున్నర దశాబ్దాల కాలంగా హోంగార్డుల విధులు నిర్వహించిన కొనపర్తి .రాములు ( HG-454,) సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో డి.ఎస్.పి పోలీస్ అధికారుల సమక్షంలో రాములు, ఆయన కుటుంబ సభ్యులను ఎస్పీ ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.

గంజాయి నియంత్రణ, సంఘ శక్తుల సమాచారం, అక్రమ కలప రవాణా తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల కీలక సమాచారంతో పాటు , అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల విధుల నిర్వహణలో హోం గార్డ్ రాములు నిర్వహించిన పాత్రను అభినందనీయమన్నారు.

అదనపు ఎస్పీ ( AR ), DAR జగిత్యాల్, R I (vఅడ్మిన్ ) RSI వీడ్కోలు సమావేశంలో పాల్గొని సన్మానించారు.