👉 రాష్ట్ర ప్రభుత్వం లేఖ విడుదల……
J.SURENDER KUMAR,
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సోమవారం సంచలన లేఖను బయటపెట్టింది.
2004లోనే ఆ భూమిని యూనివర్సిటీ ప్రభుత్వానికి అప్పగించినట్లు లేఖలో పేర్కొంది. ఆ డాక్యుమెంట్‌పై అప్పటి రిజస్ట్రార్ నరసింహులు సంతకం కూడా ఉంది. 534.28 గుంటల భూమిని ప్రభుత్వానికి అధికారులు అప్పగించినట్లు లేఖలో ఉంది.
అందుకు ప్రతిగా గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాలను ప్రభుత్వం కేటాయించినట్లు లేఖలో పేర్కొంది.

యూనివర్సిటీ వద్ద 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిని నిరసిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. అయితే తాజాగా ఆ భూమి ప్రభుత్వానిదే అని క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.
ఆ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంది.

ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుంది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు (లేక్) లేదు సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా హెచ్‌సీయూది కాదని తేలింది అని వివరణ ఇచ్చింది. విద్యార్థులను కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది.
👉 లాఠీ ఛార్జ్ చేయలేదు !
HCU లో విద్యార్థుల పై లాఠీ చార్జ్ జరగలేదని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. విద్యార్థులను కొందరు బయటి వ్యక్తులు రెచ్చగొడుతున్నారని.. నిన్న మధ్యాహ్నం 3:30 కు కంచె గచ్చిబౌలిలో పనులు జరుగుతుండగా బయటి వ్యక్తులు దాడులకు దిగారు. ప్రభుత్వ అధికారుల పై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ గాయపడ్డారని తెలిపారు.
53 మందిని అదుపులోకి తీసుకుని పర్సనల్ బాండ్ మీద వదిలేసాం. రోహిత్ , నవీన్ కుమార్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాం. వీళ్లిద్దరికీ క్యాంపస్ తో ఎలాంటి సంబంధం లేకపోయినా అక్కడ ఉండి అల్లర్లు సృష్టించారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయటం తగదు. విద్యార్థులను హాస్టల్స్ నుండి అరెస్ట్ చేశారు అనడం అవాస్తవం. యూనివర్సిటీ విద్యార్థులు బయటి వ్యక్తుల ట్రాప్ లో పడవద్దు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ స్పష్టం