J.SURENDER KUMAR,
ప్రజాపాలనలో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించిన ధర్మారం మండలం బంజేరుపల్లి తండ- బి గ్రామంలో ఇటీవల మంజూరు అయినా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కు శుక్రవారం ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
బంజేరుపల్లి తండా – బి లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందంటూ లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని, అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న భంజేరుపల్లి తండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ నిర్వహించడం జరిగిందన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను కట్టించే ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటానని, ఇండ్ల నిర్మాణం విషయంలో కూడా ఇక్కడ అవినీతికి తావు లేకుండా విడతల వారీగా డబ్బులను నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటా అన్నారు.
ఇళ్ల నిర్మాణానికి బోర్ వెల్ అవసరం ఉందని నా దృష్టికి తీసుకురావడం జరిగిందని వెంటనే నా ACDP నిధుల నుండి ఒక బోరేవెల్ మంజూరు చేసి 2 రోజుల్లో వేయిస్తాను అన్నారు.

₹ 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ వారికి కూడా రుణమాఫీ చేసి తీరుతామని, సన్న వడ్ల బోనస్ రైతుల ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.