J.SURENDER KUMAR,
గౌరవ అసెంబ్లీ స్పీకర్ ఫై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏకవచనంతో సంబోధించి అవమానపరిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, జగదీశ్ రెడ్డి నీ సస్పెండ్ చేయాలని, భే షరతుగా స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని గురువారం ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాసనసభలో డిమాండ్ చేశారు.
10 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో కొనసాగిన టిఆర్ఎస్ ప్రభుత్వం మా దళితుల పట్ల చిన్న చూపు చూస్తూ మా దళిత జాతిని అవమానపరుస్తున్నారని , విప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మా సభ్యుడు సంపత్ అసెంబ్లీలో పేపర్ పైకెత్తినందుకు శాశ్వతంగా తొలగించడానికి సస్పెండ్ చేశారని అన్నారు.