జగిత్యాల జిల్లాలో వడగళ్ల వానతో  నష్టపోయిన రైతులను ఆదుకోండి !


👉వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విప్ లక్ష్మణ్ కుమార్  విన్నపం !


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లాలో ఇటీవల కురిసిన వడగళ్ల వాన కారణంగా పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వ పక్షాన ఆదుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను  సోమవారం ధర్మపురి ఎమ్మెల్యే  ప్రభుత్వ విప్  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు.


👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ..


ఇటీవల కురిసిన వడగళ్ల వానకు జగిత్యాల జిల్లాలో పలు మండలాల్లో మొత్తం 3376 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, సుమారు 2138 మంది రైతులకు అపార నష్టం జరిగిందన్నారు.  ధర్మపురి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని, ధర్మపురి, బుగ్గరం, ఎండపెల్లి, వెల్గటూర్ గొల్లపెల్లి, పేగడపెల్లి మండలాలకు చెందిన సుమారు 2 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వినతి పత్రంలో పేర్కొన్నారు.


జిల్లా కలెక్టర్ యంత్రాంగంతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి  పంటనష్ట నివేదిక ను  మంత్రి నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అందించారు.  వడగండ్ల వాన పంట నష్టం వివరాలను  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ని కలిసి వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని, సీఎం, వ్యవసాయ మంత్రి  సానుకూలంగా స్పందించారని, ఎమ్మెల్యే తెలిపారు.


  అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతులు ఎవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, అదే విధంగా ₹ 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ కొద్దిమంది రైతులకు త్వరలోనే రుణమాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.