జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగవద్దు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలకు వచ్చే లక్షలది మంది భక్తజనం కు ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.


ఈ నెల 10 నుండి ప్రారంభం కానున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సంబందించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే లక్ష్మణ్ శనివారం రాత్రి నది తీర ప్రాంతంలో పరిశీలించారు.
ఈ సంధర్బంగా గోదావరి తీరంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం లో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం స్వామి వారి కల్యాణం నిర్వహించే శ్రీ మఠం స్థలాన్ని పరిశీలించి ఏర్పాటుతో గూర్చి అధికారులను వివరాలు అడిగి తగు సూచనలు చేశారు. కళ్యాణ వేదిక, భక్తుల ఎంట్రీ ఎగ్జిట్ దారులు, వాహనాల పార్కింగ్, భక్తులకు తాగునీటి సౌకర్యం, వాష్ రూమ్ లో, లైటింగ్ , అందుబాటులో జనరేటర్ సౌకర్యం, ఫైర్ ఇంజన్, అంబులెన్స్, పారామెడికల్ సిబ్బంది, ఎల్ఈడి స్క్రీన్లు, కళ్యాణం అనంతరం స్వామివారి దర్శనం కోసం తొక్కిస్తాలాట జరగకుండా క్యూ లైన్లు తదితర అంశాలపై అధికారం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు