👉 దాదాపు లక్ష లడ్డూలు, పది క్వింటాళ్ల పులిహోర తయారీకి కసరత్తు !
👉 ఈనెల 10 నుండి 22 వరకు జాతర ఉత్సవాలు !
J.SURENDER KUMAR,
ఈనెల పది నుండి ఆరంభం కానున్న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలలో భక్తులకు అమ్మకాలు కొనసాగించే స్వామివారి ప్రసాదాల తయారీలో ఆలయ యంత్రాంగం నాణ్యత ప్రమాణాలు పాటిస్తారా ?ఇష్టానుసారంగా తయారు చేస్తారా ? అనే చర్చ మొదలైంది.
12 రోజులపాటు దాదాపు 4 లక్షల మంది భక్తులు జాతరకు రానున్నారని అధికార యంత్రాంగం అంచనాలు వేస్తూ ఆ మేరకు భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన ఉత్సవాలు స్వామి వారి కళ్యాణం, మూడు రోజుల పాటు తేప్పోత్సవం, డోలోత్సవం, రథోత్సవాలలో భక్తుల సౌలభ్యం కోసం లక్ష లడ్డూలు, దాదాపు పది క్వింటాళ్లు పులిహోర తయారీకి కసరత్తు చేస్తున్నారు.
👉 దేవాదాయ శాఖ సర్కులర్ మేరకు మేరకు లడ్డు, తయారీలో వినియోగించాల్సిన నాణ్యత ప్రమాణాలు గల సరుకుల క్వాంటిటీ ఇలా ఉన్నాయి.
👉 100 కిలోల శనగపిండితో లడ్డు తయారీలో వాడాల్సిన సరుకులు !

👉 100 కిలోల శనగపిండి, 2 క్వింటాళ్ల పంచదార, 5 కిలో మిస్రీ
👉 5 కిలో కిస్మిస్, 7.500 కిలో ఖాజు, (డబుల్ సైజు) 75 కిలోల బ్రాండెడ్ నెయ్యి, 1 కిలోల యాలకుల పొడి, 100 గ్రాములు జాజికాయ, 100 గ్రాముల పచ్చ కర్పూరం. వినియోగించాల్సి ఉంటుంది.
👉 వీటి తయారీకి నిబంధనల మేరకు రెండు గ్యాస్ సిలిండర్లు వినియోగించాల్సి ఉంటుంది.
👉 పులిహోర 100 కిలోల తయారీకి !

👉 100 కిలోల బిపిటి పాత బియ్యం,
5 కిలో శనగపప్పు, అర్ధ కిలో మినప్పప్పు, 5 కిలో పల్లీలు, 0.500 గ్రాముల పసుపు,
👉 20 కిలోల నూనె, 20 కిలోల చింతపండు, 1 కిలో ఎండుమిర్చి, కిలో ఉప్పు, 100 గ్రాముల జిలకర, 1 కిలోలఆవాలు, 0.50 గ్రాముల మెంతులు, 1 కిలో మిరియాలు, 0.040 గ్రాముల ఇంగువ, వినియోగించాల్సి ఉంటుంది.
👉 లడ్డు బరువు ,80 గ్రాములు. పులిహోర ప్యాకెట్ 200 గ్రాములు ఉండాలి !
నిత్యవసర సరుకుల గోదాం నిర్వాహక ఉద్యోగి అవకతవకలకు పాల్పడినట్టు దేవాదాయ శాఖ రికార్డులలో నమోదై ఉన్న నేపథ్యంలో
ప్రసాదాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ , కల్తీ నిరోధక శాఖ అధికారులు పర్యవేక్షణలో తయారు చేయాలి అంటూ భక్తజనం కోరుతున్నారు.