కార్యదర్శి సేవలు అభినందనీయంఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి గా మైలారపు భూమన్న నిర్వహణలో అందించిన సేవలు అభినందనీయమని  ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి లోని  వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్యదర్శిగా విధులు నిర్వహించిన భూమన్న  శుక్రవారం పదవి విరమణ చేశారు.  ఈ వీడ్కోలు   కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని సన్మానించారు.

👉 క్రీడాకారిణి కి సన్మానం !

ధర్మపురి మండలం నక్కల పేట గ్రామానికి చెందిన భుక్య శ్రావణి పవర్ లిఫ్టింగ్ 52 కేజీల విభాగంలో జాతీయ స్థాయిలో ఎంపికైన సందర్భంగా శ్రావణినీ  ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సన్మానించి అభినందించారు. ప్రభుత్వ పరంగా ఎటువంటి అవసరం ఉన్న సహాయ సహకారాలు అందిస్తామని ఈ సంధర్భంగా వారి కుటుంబ సభ్యులకి తెలిపారు.


👉 ఎమ్మెల్యేను కలసిన కమిషనర్ !


ధర్మపురి పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కల్లెడ రాజశేఖర్  ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు