J.SURENDER KUMAR,
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామివారి దేవస్థానము 55 రోజులలో 12 హుండీ ల ద్వారా స్వామివారికి ₹ 1,09,13,339/- ( కోటి తొమ్మిది లక్షల ,13 వేల, 339 ) రూపాయల ఆదాయం వచ్చిందని, ఆలయ కార్యనిర్వహణాధికారి & ఉప కమీషనర్ శ్రీకాంత్ రావు తెలిపారు.
భారీ నిఘా నీడలో ( 26-03-2025) బుదవారము శ్రీ లలిత సేవా ట్రస్ట్ వారిచే (12) హుండీలు లెక్కింపు చేయగా వచ్చిన మిశ్రమ వెండి, బంగారము తిరిగి బ్యాగ్ లో వేసి సీల్ చేసి హుండీలో భద్రపరచనైనది. విదేశీ కరెన్సీ ( 109 ) నోట్స్ వచ్చినట్టు తెలిపారు.

హుండీ లెక్కింపునకు పర్యవేక్షణాధికారిగా శ్రీమతి సుప్రియ, సహాయ కమీషనర్ దేవాదాయ శాఖ కరీంనగర్ లెక్కింపు నందు దేవాలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, పర్యవేక్షకులు సునీల్ కుమార్, చంద్రశేఖర్, హరిహరనాత్, ఆలయ సిబ్బంది, ఏ.ఎస్.ఐ, మహిళా కానిస్టేబుల్స్, హెూంగార్డ్స్, బ్యాంక్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది ల సమక్షంలో లెక్కించారు.