మహిళా రైతులకు సబ్సిడీ పై యంత్ర పరికరాలు !

J.SURENDER KUMAR,


కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీ కరణ ఉప పథకం  ( S M A M )  కింద మహిళా రైతులకు సబ్సిడీ పై  వ్యవసాయ యంత్ర పరికరాలు అందించనున్నట్టు గురువారం ధర్మపురి మండల వ్యవసాయ శాఖ ప్రకటనలో పేర్కొంది.


ఈ నెల మార్చి 25 లోగ లబ్ధిదారులకు ఎంపిక చేసి యంత్రాలు ఉపకరణాలు అందజేసే ప్రక్రియ జరగనున్నది.
ఈ మేరకు  మహిళా రైతుల నుండి దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది సన్న చిన్నకారు రైతులకు 40%, ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు 50% సబ్సిడీపై ఇవ్వనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

👉 మండల స్థాయిలో రాయితీపై అందించే యంత్ర పరికరాలు !

👉 బ్యాటరీ స్ప్రేయర్స్ – 6

👉 పవర్ స్ప్రేయర్స్ –  6

👉 రోటవేటర్స్        – 3

👉 కేజీ వీల్స్ /కల్టివేటర్/ డిస్క్ హ్యారో/ ఎం బి ప్లవ్ – 4


👉 డివిజన్ స్థాయిలో రాయితీపై అందించే యంత్ర పరికరాలు !

👉 సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ – 4

👉 బండ్ ఫార్మర్ – 1

👉 బ్రష్ కట్టర్ – 1

👉 పవర్ టిల్లర్ – 1


👉 జిల్లా స్థాయిలో రాయితీపై అందించే యంత్ర పరికరాలు !

👉 ట్రాక్టర్  – 3

👉 పవర్ వీడర్ – 2

👉 స్ట్రా బేలర్ (గడ్డి కట్టలు కట్టు యంత్రం) – 2

👉 డ్రోన్స్ – 1


ఆసక్తి కలిగిన మహిళా రైతులు ధర్మపురి మండల వ్యసాయాధికారి కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనల్లో పేర్కొన్నారు.