మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి !

👉 ధర్మపురి కోర్టు జడ్జి శ్యాం ప్రసాద్ !


J.SURENDER KUMAR,


స్త్రీ లేకపోతే సృష్టే లేదు, సృష్టికి మూలం మహిళ తల్లిగా భార్యగా, సోదరిగా, కూతురిగా, పురుషుడిని ప్రేమించే గొప్పతనం మహిళ అని జడ్జి శ్యాం ప్రసాద్ అన్నారు


మహిళా దినోత్సవం సందర్భంగా ధర్మపురి కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా జడ్జి శ్యాం ప్రసాద్ హాజరై మహిళా న్యాయవాదులు, మహిళా స్టాఫ్ తో కలసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు
. ఈ సందర్భంగా ఆయన మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం వారికి జ్ఞాపికలను అందజేశారు .


ధర్మపురి బార్ అసోసియేషన్ అధ్యక్షులు రౌతు రాజేష్, గౌరవ అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రామడుగు రాజేష్ , కోశాధికారి జాజాల రమేష్, న్యాయవాదులు ఇమ్మడి శ్రీనివాస్, సుంకే రాజు, కలమడుగు కీర్తి, పుల్లూరి సాయి శ్రీ రమ్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


👉 రాజి మర్గమే రాజమర్గం – జడ్జి శ్యాం ప్రసాద్ !


👉 222 కేసులు పరిష్కారం !


రాజిమార్గమే రాజమార్గం అని ధర్మపురి కోర్టు న్యాయమూర్తి శ్యాంప్రసాద్ అన్నారు .
జాతీయ లోక్ అదాలత్ పురస్కరించుకొని ధర్మపురి కోర్టులో కక్షిదరులు రాజిపడి 222 కేసులు పరిష్కారం అయ్యాయి .
ఈ కార్యక్రమంలో సీఐ రాంనర్సింహారెడ్డి ధర్మపురి, బగ్గారం, వెల్గటూర్, ఎస్ ఐలు ,ఉదయ్ కుమార్ , శ్రీధర్ రెడ్డి, ఉమ సాగర్,


ధర్మపురి బార్ అసోసియేషన్ అధ్యక్షులు రౌతు రాజేష్, గౌరవ అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రామడుగు రాజేష్, కోశాధికారి జాజాల రమేష్ ,న్యాయవాదులు ఇమ్మడి శ్రీనివాస్, సుంకే రాజు, కలమడుగు కీర్తి, పుల్లూరి సాయి శ్రీ రమ్య, కోర్టు సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు