మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉 మహిళా శక్తి భవన నిర్మాణానికి భూమి పూజ


👉 పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలెక్టర్ సత్యప్రసాద్ !


J.SURENDER KUMAR,


కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని, రాబోయే ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని ఎస్సారెస్పీ  ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో ₹ 5 కోట్లతో చేపట్టనున్న  మహిళా శక్తి భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ తో కలిసి భూమి పూజ చేశారు.

👉 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని, ఇందుకోసమే మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నదని తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.

👉 జగిత్యాల జిల్లాలో  90 శాతం రుణమాఫీ జరిగిందని, రెండు లక్షల వరకు ఉన్న రైతులకు రుణమాఫీ జరిగిందని తెలిపారు. మిగతా వారికి కూడా త్వరలోనే రుణమాఫీ జరుగుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు.

👉 రుణమాఫీ జరగని వారికి అధికారులు త్వరలోనే రుణమాఫీ చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని వీటిని ఓర్వలేకనే బిఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే కాలంలోనూ రాష్ట్రంలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

👉 కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ..

జగిత్యాల జిల్లాలో మహిళా సంఘాల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని  కలెక్టర్ అన్నారు.

👉 తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాల సాధికారతకు కల్పించడానికి వారి జీవనోపాధి బలోపేతం చేయడానికి మహిళ శక్తి కార్యక్రమం అమలు చేస్తుందన్నారు.

👉 వచ్చే ఐదేళ్ల కాలంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.

👉 ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల బ్యాంకు రుణాలను వడ్డీ లేకుండా అనుసంధానం చేసి వివిధ రకాల మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేస్తూ ఎస్ హెచ్ జి మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు.

👉 జిల్లాలో మొత్తం స్వ శక్తి  సంఘాలు 15150 ఉన్నాయని,. మొత్తం గ్రామ సమాఖ్య సంఘాలు 565 మండల సమైక్య సంఘాలు 18 , జిల్లా సమైక్య జగిత్యాల సమైక్య ఒకటి ఉందని తెలిపారు.

👉 జిల్లాలో ( 0)వడ్డీ కింద స్వశక్తి మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఒక్కో సంఘానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, 7071 సంఘాలకు ₹ 722.00 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు.

👉 మిల్క్ ఎనిమల్స్ గ్రౌండింగ్ యూనిట్లో ద్వారా మొత్తం 89 యూనిట్లకు ₹ 82,77 లక్షల రుణం ప్రభుత్వం మంజూరు చేస్తుందని,  పౌల్ట్రీ యూనిట్ మొత్తం యూనిట్లో 16,83 రుణం ₹ 2. 93 లక్షలు మంజూరు చేసిందని పేర్కొన్నారు.  పౌల్ట్రీ మదర్ యూనిట్ ద్వారా 18 యూనిట్లు 78 లక్షలు. మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్ ద్వారా ఒక్క యూనిట్కు పది లక్షలు ప్రభుత్వం ద్వారా మంజూరు చేస్తుందని చెప్పారు.

👉 అలాగే 68 సబ్ సబ్ స్టేషన్ల పరిధిలో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నామని వీటి నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలు చూడాల్సి ఉంటుందని తెలిపారు. రాబోయే కాలంలో మరింత సమర్థవంతంగా సేవలందిస్తే మరిన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

👉 జిల్లాలో 15 మహిళా సంఘాలకు 15 బస్సులు అందిస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక శక్తికి ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బస్సులు లీజు ఇస్తుందని దీని ద్వారా మహిళా సభ్యులకు ఒక నెలకు 77వేల రెంటు ప్రభుత్వం చెల్లిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

👉 మహిళా సంఘాల భవనం సభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతుందని కలెక్టర్ తెలిపారు.

👉 జిల్లాలో 133 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా మహిళా సంఘాలు నిర్వహించాయని, రాబోయే కాలంలో మరింత ధాన్యం కేంద్రాలను అందిస్తామని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ వల్ల దాదాపు ₹ 3.5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు సౌకర్యాలను మహిళా సంఘాలు సద్వినియం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు.

👉 అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలకు, విప్ లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో, అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డీవో, మధు సుధను, డిఆర్డిఓ,రఘు వరుణ్, డి.ఎస్.పి, మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతి, తదితరులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.