మానవ రవాణా లో ధర్మపురి వాసి కి లుకౌట్ నోటీసు (బ్లూ నోటీసు) ?


👉 ధర్మపురిలో ఎఫ్ఐఆర్ నమోదు !


J.SURENDER KUMAR,


నిరుద్యోగ యువతను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అంటూ విదేశాల్లో చైనీస్ సైబర్ ఫ్రాడ్ కంపెనీ ముఠాకు విక్రయిస్తున్న  జగిత్యాల జిల్లా ధర్మపురికి  చెందిన శ్యామ్ రావు, రాజశేఖర్ అలియాస్ రోమన్, రాజస్థాన్ కు చెందిన అర్జున్ హితేష్ సోమయ్య కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లుకౌట్ ( బ్లూ ) నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, మానకొండూర్, ధర్మపురి పోలీస్ స్టేషన్ లో శ్యామ్ రావు రాజశేఖర్ అలియాస్ రోమన్ పై ఎఫ్ఐఆర్ నమోదైనట్టు సమాచారం.

👉 లుకౌట్ నోటీసు – బ్లూ నోటీసు అంటే…

నిందితులు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉంటే, భారతీయ అధికారులు ఇంటర్‌పోల్ (అంతర్జాతీయ పోలీసు సంస్థ) ద్వారా బ్లూ నోటీసు జారీ చేయమని కోరవచ్చు.
ఒ నిందితుడి గుర్తింపు, స్థానం లేదా కార్యకలాపాలు కదలికల గూర్చి అదనపు సమాచారాన్ని సేకరించడానికి మరియు ఆ నిందితుడు దర్యాప్తు లేదా ప్రాసిక్యూషన్ కోసం కావాలని సభ్య దేశాలకు తెలియజేయడానికి బ్లూ నోటీసు జారీ చేయబడుతుంది.


ఇంటర్‌పోల్ సభ్య దేశాలు, ఇమ్మిగ్రేషన్ అధికారులు సహా, ఆ నిందితుడి కోసం నిఘా ఉంచడానికి మరియు అభ్యర్థించే దేశానికి సంబంధిత సమాచారాన్ని అందించడానికి అప్రమత్తం చేయబడతాయి. లుకౌట్ నోటీసును భారతదేశంలో దేశీయంగా మరియు అంతర్జాతీయంగా జారీ చేయవచ్చు.

👉 దేశీయ లుకౌట్ నోటీసు…

భారతదేశంలో, పోలీసు లేదా దర్యాప్తు సంస్థలు దేశంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు మరియు సరిహద్దు దాటవేసే ప్రదేశాలను అప్రమత్తం చేయడానికి లుకౌట్ నోటీసును జారీ చేస్తాయి.

👉 కీలక సూత్రధారులు పాత్రధారులు వీరే ?

తెలంగాణకు చెందిన పలువురు యువకులను కంప్యూటర్ ఆపరేటర్ డాటా ఎంట్రీ పేరిట లావోస్ పంపిస్తూ, ( అక్కడి నుండి అక్రమ మానవ రవాణా  పాల్పడుతున్న ) స్కామ్ లో  శ్యామ్ రావు అలియాస్ రోమన్,

👉శ్యామ్ రావు రాజశేఖర్ (ఫైల్ ఫోటో)

రాజస్థాన్  కు చెందిన హితేష్ అర్జున్ సోమయ్య లు కిలక సూత్రధారులు పాత్రధారులుగా హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నట్టు తెలిసింది.

👉హితేష్ అర్జున్ సోమయ్య రాజస్థాన్ (ఫైల్ ఫోటో)


👉 కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి శ్రీధర్ బాబు జోక్యంతో…


బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంత్రి శ్రీధర్ బాబు, సమస్యను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, సమస్య తీవ్రతను భారత ప్రభుత్వానికి వివరించి చైనీస్ ఫ్రాడ్ కంపెనీ ముఠాలో బందీలు గా ఉన్న భారత యువత కోసం  మయన్మార్ దేశం మైనాడి జిల్లా లో వారి స్థావరం పై అక్కడి సైన్యం తో దాడులు చేయించి 540 మంది భారతీయ యువకులను విడిపించి  ఆ దేశంలోని ఇండియన్ ఎంబీసీకి అప్పగించారు. రెండు విమానాలలో వారిని  భారతదేశానికి ఈ నెలలో పంపిన విషయం తెలిసిందే.


👉 వివరాలు సేకరించిన CBI, NIA, IB అధికారులు ! 


రెండు విమానాలలో భారత్ కు వచ్చిన 540 మంది బాధితులను విమానాశ్రయంలో CBI, NIA, I.B అధికారులు  వారి నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది.  ప్రత్యేకంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, (NIA)  ఇంటిలిజెన్సీ బ్యూరో (IB) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( CBI ) అధికారులు రాష్ట్రాలవారీగా  ఉద్యోగాల పేరిట మిమ్మల్ని సంప్రదించంది ఎవరు ? ఎంత మొత్తం చెల్లించారు ?  ఏజెంట్ లు, మధ్యవర్తులు ఎవరు ?  తదితర వివరాలు సేకరించి ఇన్వెస్టిగేషన్ అధికారులు, వారు అక్కడ వినియోగించిన సెల్ ఫోన్ ల ను స్వాధీన పరుచుకుని అందులోని సమాచారం రీ ట్రీట్  చేసీ కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది.

540 మందిలో  తెలంగాణ కు చెందినా వారి సంఖ్య దాదాపు 50 మంది వరకు ఉండవచ్చు మరో 500 మంది దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందినవారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు ప్రభుత్వాలకు ఇన్వెస్టిగేషన్  అధికారులు సమాచారం అందించి కేసులు నమోదు,  కు ఆదేశించినట్టు తెలిసింది.

👉 ఉద్యోగాల ఎరచూపి…

తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరు ద్యోగ యువతీ, యువకులను కంప్యూటర్ డాటా ఎంట్రీ పేరుతో కొంత మంది ఏజెంట్లు నమ్మించి విజిట్ వీసాల పై మొదట థాయిలాండ్ పంపిస్తారు.  అక్కడి నుంచి  బస్సులు, ట్యాక్సీల ద్వారా థాయిలాండ్ సరిహద్దుల్లో  లావోస్ సరిహద్దు నుండి ఆ దేశానికి తరలిస్తుంటారు.

👉ముఠా సభ్యుల చరణ్ నుంచి యువతను తరలిస్తున్న దృశ్యం(ఫైల్ ఫోటో)


👉 గోల్డెన్ ట్రయాంగిల్ సిటీ లో సైబర్ క్రైమ్ అడ్డా ఈ భవనంలోనే (ఫైల్ ఫోటో)


  ఆ దేశం కు చేరిన వారి  పాస్ పోర్ట్ లు ముఠా సభ్యులు తీసుకుని సైబర్ ఉచ్చులో దింపుతున్నారు. ఇలాంటి పనిని నిరాక రించిన వారిని పట్టణ సరిహద్దుకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేస్తారని బాధితులు పోలీసులకు వివరించినట్టు సమాచారం. సైబర్ నేరాలకు పాల్పడే చాలా మంది చైనీస్ లు లావోస్ లో గోల్డెన్ ట్రయాంగిల్ సిటీని అడ్డాగా ఎంచుకుని తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

👉 రాష్ట్రాల వారీగా …

ఆయా  రాష్ట్రాల ప్రజల వ్యవహారిక భాషల ఆ రాష్ట్రాలకు చెందిన యువతతో సైబర్ క్రైమ్ నిర్వహణ తీరుపై అక్కడే ముఠా సభ్యులు కొన్ని రోజులపాటు శిక్షణ  ఇస్తారు. వారి కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతంలో, పనిచే సే యువతీ, యువకులపై సీ సీ కెమెరాల నిఘాతో పర్యవేక్షిస్తుంటారు. వారి పర్యవేక్షణలో ఏదైనా పొరపాట్లు చేస్తే కఠినంగా శిక్షించడంతో పాటు, చిత్రహింసలకు గురిచేస్తుంటారు. ఇక్కడి నుంచి లావోస్ కు చేరుకున్న యువతీ, యువకులకు చైనీయుల పేరుతో గుర్తింపు కార్డులు (ఐడీలు) ఇస్తారు. ఫోన్ నంబర్లతో సైబర్ నేరాలకు పాల్పడేలా శిక్షణ ఇచ్చి నేరాలు చేయిస్తున్నారు.


డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట లావోస్  వెళ్లిన వారి సమాచారం కొన్ని రోజులపాటు కుటుంబ సభ్యులకు తెలియకపోవడంతో వారు పంపించిన ఏజెంట్ ను ప్రశ్నిస్తూ, నిలదీస్తూ తమ వారి ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించడంతో ఏజెంట్ లు, మధ్యవర్తులను స్థానిక పోలీసులు అదుపులో తీసుకొని విచారించడంతో అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా ముఠా కార్యకలాపాలు వెలుగు చూసినట్టు సమాచారం. చూసాయి.

👉ఎఫ్ ఐ ఆర్ లు హైదరాబాద్ కు ?

తెలంగాణలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏజెంట్ల పై నమోదైన ఎఫ్ఐఆర్ లను బాధిత కుటుంబ సభ్యుల, బాధితుల వాంగ్మూలాలు రికార్డు చేసిన పోలీసులు, జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల వివరాలు హైదరాబాదులో సైబర్ క్రైమ్ బ్యూరో కీలక పోలీస్ ఉన్నతాధికారి కి నివేదిక అందించినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా థాయిలాండ్ లో అదృశ్యమైన  ఇద్దరు యువకుల ఆచూకీ కోసం మోర్తాడ్ పోలీసులు ఇటీవల ఓ ఏజెంట్ ను అదుపులోకి విచారిస్తున్నట్టు సమాచారం. గత నెల రోజుల క్రితం హైదరాబాదులో ప్రవాసి ప్రజావాణి లో  నిజామాబాద్ జిల్లా కు చెందిన శనిగరపు అరవింద్, జగిత్యాల జిల్లా కు చెందిన కొండ సాగర్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

👉 ధర్మపురిలో..

కీలక సూత్రధారి ధర్మపురికి చెందిన వాడు కావడంతో ఏ ప్రాంతంలో ఎంతో మందిని తరలించాడు అనే కోణంలో స్థానిక పోలీస్ యంత్రాంగం రహస్యం గా విచారణ చేపట్టినట్టు సమాచారం. అయితే ఓ యువకుడిని సంప్రదించి కొంత మొత్తం నగదు తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే బాధిత యువకుడు  ఇక్కడే ఉండడంతో. అతని వాంగ్మూలం నమోదు చేసి రాజశేఖర్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్టు తెలిసింది.


👉తన వారి ఆచూకీ కోసం ఫిర్యాదు చేస్తున్న కుటుంబ సభ్యులు (ఫైల్ ఫోటో)

కొన్ని రోజుల క్రితం జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు ఏజెంట్లను, మధ్యవర్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని  విచారిస్తున్న నేపథ్యంలో ఈ స్కామ్ లో ధర్మపురి పట్టణానికి చెందిన యువకుడి  గూర్చి సైబర్ క్రైమ్ అధికారులకు వారు వివరించినట్టు సమాచారం. లావోస్ లోని గోల్డెన్ ట్రయాంగిల్ ఎకనామికల్ సిటీ లో ‘ రోషన్ ‘ అనే  పేరుతో సైబర్ క్రైమ్ కార్యకలాపాలను రోషన్ పర్యవేక్షిస్తాడని పోలీసులు సమాచారం సేకరించినట్టు తెలిసింది. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు భారత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు , పోలీసు యంత్రాంగం మానవ అక్రమ రవాణా స్కాంపై ఉక్కు పాదం మోపుతూ పలువురు ఏజెంట్లను అదుపులో తీసుకొని అరెస్టు చేస్తు రాకెట్ ఛేదించే దిశగా విచారణను ముమ్మరం చేస్తున్నట్టు తెలిసింది.