మంథని లో ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు !

👉 పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు !


J.SURENDER KUMAR,


ఉమ్మడి రాష్ట్ర శాసనసభా మాజీ సభాపతి స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు 88 జయంతి వేడుకలు ఆదివారం మంథని పట్ట ణంలో ఘనంగా జరిగాయి. శ్రీపాదరావు తనయుడు మంత్రి శ్రీధర్ బాబు వేడుకలలో పాల్గొన్నారు.


మంథని పట్టణంలో శ్రీపాద చౌక్ వద్ద శ్రీపాద రావు విగ్రహానికి మంత్రి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.


మంత్రి శ్రీధర్ బాబు చెరువు కట్ట , మరియు ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీపాద రావు విగ్రహాలకు పూలమాలలు వేశారు.


మంథని ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు మరియు హాస్పటల్లో పనిచేసే సిబ్బందికి చీరలు పంపిణీ మరియు మంథని బస్టాండ్ లో ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్ లో పంపిణీ చేశారు.

మంత్రి క్యాంప్ కార్యాలయంలో NSUI ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు గెలుపొందిన వారికి బహుమతులు అందించారు.