👉 సీఎం, డిప్యూటీ సీఎం, కు విప్ లక్ష్మణ్ కుమార్ నాయకత్వం లోమాదిగ ఎమ్మెల్యేల విజ్ఞప్తి !
J.SURENDER KUMAR,
త్వరలో విస్తరణ జరగనున్న మంత్రివర్గంలో మాదిగ సమాజానికి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో ఎమ్మెల్యేల బృందం బుధవారం అసెంబ్లీలో కలిసి విజ్ఞప్తి చేసి వినతి పత్రం ఇచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంటరీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, మరియు వరంగల్ నియోజకవర్గాలలో మాదిగ సమాజానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఈ జిల్లాల్లో మాదిగ సమాజం పెద్ద సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు.
ఇటీవల ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించలేదని, మేము ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నాము. కానీ మా సమాజానికి రాష్ట్ర మంత్రివర్గంలో మా జనాభా ప్రకారం తగినంత ప్రాతినిధ్యం లేదు అని వారు సీఎంకు వివరించారు.
మేము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. మా జాతికి సరైన ప్రాతినిధ్యం కావాలని, మా మాదిగ సమాజం నుంచి ఒక మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, మాకు రాబోయే రాష్ట్ర మంత్రివర్గంలో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ వినతి పత్రంలో పేర్కొన్నారు.
👉మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీకి విన్నపం !

తొలిసారి ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రంగా తెలంగాణకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని, ఈ మేరకు మంత్రివర్గ విస్తరణలోనూ తమకు న్యాయం చేయాలని మాదిగ సామాజిక వర్గం ఎమ్మె ల్యేలు పార్టీ జాతీయ అధ్యక్షుడు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత, రాహుల్ గాంధీ లకు మంగళవారం విన్నవించినట్లు సమాచారం.
లోక్ సభ ఎన్నికల సమ యంలో పార్టీ టికెట్ల కేటాయింపులో సైతం తమ సామాజికవర్గానికి తగినంత వాటా దక్కలేదని, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమకు టికెట్ ఇవ్వలేదని వారు ఆ వినతిలో వివరించినట్లు సమాచారం.
రాష్ట్ర జనాభా నిష్పత్తి ప్రకారం మంత్రివర్గంలో తమ వర్గానికి కనీసం రెండు మంత్రి పదవులు ఉండాలని పేర్కొన్నట్టు తెలిసింది. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం ఒక్కరే ఉన్నారని వారు అధిష్ఠానానికి పంపిన వినతిపత్రం లో వివరించినట్టు తెలిసింది.
తమ సామాజికవర్గం జనాభా ప్రకారం మంత్రి వర్గంలో వాటా కల్పిస్తేనే న్యాయం జరుగుతుందని ఈ అంశం మంత్రి దామోదర రాజనర్సింహ కు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు విన్నవించినట్టు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు.