J.SURENDER KUMAR,
ఈనెల 10 నుండి 22 వరకు జరగనున్న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనవలసినదిగా మంత్రులను ఆహ్వానిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి సంకట శ్రీనివాస్ కోరారు.

శనివారం హైదరాబాదు లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ ను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కలసి ఆహ్వనం తో పాటు స్వామివారి శేష వస్త్ర ప్రసాదం అందించారు.
👉 గోదావరి తీరంలో ఏర్పాటు..

స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గోదావరి నది తీరంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు , డ్రెస్ ఛేజింగ్ ( వస్త్రాలు మార్చుకునే ) గదులను దేవస్థానం పక్షాన ఏర్పాటు చేశారు.