J. SURENDER KUMAR.
ఈ నెల 18వ తేదీన 2025 – 2028 కాలపరిమితికి గాను మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం ఎన్నికలు తూప్రాన్ పట్టణంలోని దేవీ గార్డెన్స్ లో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి సోమయాజుల రవీంద్ర శర్మ, సహాయ ఎన్నికల అధికారులు శాస్త్రుల మధుశ్రీ శర్మ, డి.జి .శ్రీనివాస శర్మ తెలిపారు.
ఎన్నికలు సజావుగా సాగడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని.ఆ రోజు జిల్లా సంఘంలో సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలిపారు.
జిల్లా బ్రాహ్మణ సంఘం ఎన్నికల షెడ్యూలును వారు ప్రకటించారు.
👉 18.03.2025 రోజున ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నామినేషన్ల స్వీకరణ..
👉 మధ్యాహ్నం 1.30 నుంచి 2.00 గంటల వరకు నామినేషన్ల పరిశీలన,
👉 మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 3.00 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ,
👉 3.00 గంటల నుంచి 3.15 గంటల వరకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన,
👉 సాయంత్రం 3.15 నుంచి 4.00 గంటల వరకు ఎన్నికల సమయం,
👉 4.00 నుంచి 4.30 వరకు ఓట్ల లెక్కింపు,
👉 సాయంత్రం 5.00గంటలకు ఫలితాల ప్రకటన ఉంటుందని తెలిపారు.
తదుపరి ధృవపత్రాల అందజేత, ఎన్నికైన వారిచేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుందని వారు తెలిపారు..