మత సామరస్యానికి ప్రతీక కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అన్ని మతాలను సమానంగా ప్రేమాభిమానాలతో చూస్తూ మత సామరస్యానికి ప్రతీక అని  ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్  లక్ష్మణ్ కుమార్ అన్నారు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ధర్మపురి పట్టణంలోని  S H గార్డెన్ లో  ప్రభుత్వం పక్షాన ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.


కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో, తన గెలుపులో మైనార్టీలు అండగా ఉన్నారని, మైనార్టీ కార్పోరేషన్ నుండి కూడా అర్హులైన సోదర సోదరీమణులకు రుణాలను అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు