J.SURENDER KUMAR,
మతాలకతీతంగా కలిసిమెలిసి జీవనం కొనసాగించే ధర్మపురి క్షేత్రం మతసామరస్యానికి ప్రతీక అని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు

పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం ధర్మపురి పట్టణంలోని స్థానిక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద గల ఈద్గా లో ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్ధనల లో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పట్టణానికి చెందిన ముజ్జు కంటి వైద్య చికిత్స ఖర్చుల నిమిత్తం ₹ 10 వేల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందించారు

ఈ సందర్భ గా మైనార్టీ నాయకులు కొందరు వక్స్ బోర్డ్ స్థలం గూర్చి ఎమ్మెల్యే వివరించారు. ఈ అంశం వక్స్ బోర్డ్ చైర్మెన్ దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరానికి కృషి చేస్తామని, వారికి హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి పేదవారికి, మైనారిటీలకు యువ వికాసం కింద రుణాలు అందిస్తామని తెలిపారు.