J.SURENDER KUMAR,
మిల్లర్లు వారి కేటాయించిన ధాన్యం మిల్లింగ్ వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్. బిఎస్ లత అన్నారు. జిల్లాలోని బుగ్గారం, ధర్మపురి మండలాల పరిధిలోని పలు ధాన్యం మిల్లింగ్ ఇండస్ట్రీలను అడిషనల్ కలెక్టర్ మంగళవారం సందర్శించారు.
మిల్లింగ్ పాయింట్లు, రికార్డులను తనిఖీ చేశారు. కేటాయించిన ధాన్యం, మిల్లింగ్ పూర్తయిన ధాన్యానికి సంబంధించిన వివరాలను మిల్లర్లను అడిగి తెలుసుకున్నారు.
యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభించే సమయం కూడా ఆసన్నమవుతున్నందున వానాకాలం ధాన్యం మిల్లింగ్ సత్వరమే పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం చిన్నాపూర్ గ్రామంలోని నర్సరీని సందర్శించారు. తిమ్మాపూర్ గ్రామ పంచాయతీని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు.
ఎల్ ఆర్ ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అవగాహన కల్పించి ఈనెల 31 లోపు ఫీజు చెల్లించేలా చూడాలని పంచాయతీ అధికారులకి సూచించారు. ఇప్పటివరకు పూర్తయిన ఎల్ఆర్ఎస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.