ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రతిభావంతులైన మహిళలకు సన్మానం !

👉 మహిళా దినోత్సవ సందర్భంగా…


J.SURENDER KUMAR,


ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిభావంతులైన మహిళలను సన్మానించారు.


పట్టణ మహిళ అధ్యక్షురాలు వేముల నాగలక్ష్మి ఆధ్వర్యంలో పవర్ లిఫ్టింగ్ క్రీడా పోటీలలో అత్యంత ప్రతిభ కనబర్చిన అనేక అవార్డులు గెలుచుకున్న ధర్మపురి క్రీడాకారిణి విరంచి స్వప్నికను మరియు మహిళా కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త సింగం పద్మ , రైతు మహిళా మాడిశెట్టి అమ్మాయి, ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర జనరల్ సెక్రెటరీ తాటిపర్తి శోభారాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయ లక్ష్మీ పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య , వెల్కటూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపిక, పెగడపల్లి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, ధర్మపురి నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు మంజుల, ఆసెట్టి మమత , మాజీ కౌన్సిలర్లు సంగనభట్ల సంతోషి, గరిగే అరుణ, జక్కు పద్మ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.