ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లుబాటు కానీ ఓట్లు వేసింది ఎవరు ?


J.SURENDER KUMAR,


డిగ్రీ పట్టాలు పుచ్చుకొని, ఉద్యోగాలు చేస్తున్నవారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ విధానం తెలియదా ? కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో వేలాది ఓట్లు నిరుపయోగం అయ్యాయి, అంటూ విమర్శలు, ఆరోపణలు సోమవారం నుంచి ప్రచార సాధనాల్లో వినిపిస్తున్న, అగుపిస్తున్న విషయం తెలిసిందే.


చెల్లుబాటు కానీ ఓట్లు వేసింది ఎవరు ? ఎంతమంది ? అవగాహన లేని కొందరు వేసిన చెల్లుబాటు కానీ ఓట్లతో ఉద్యోగ, ఉపాధ్యాయ పట్టభద్రులు మానసిక వేదన చెందుతున్నారు. ఓటింగ్ అవగాహన లేని కొందరి చర్యలతో వారు విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చెల్లుబాటు కానీ ఓట్లు వేసింది ఐదు శాతం మంది పట్ట బద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉండి ఉండవచ్చు, 95% పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేయించుకున్న నిరుద్యోగులు కావచ్చు అనే చర్చ. సైతం జరుగుతున్నది.


ఇది ఇలా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ అధికారులు గా విధులు నిర్వహించిన కొందరు, ఉద్యోగులు, పోలింగ్ బూత్ లలో ఏజెంట్లుగా ఉన్నవారి మాటల్లో.

నూతనంగా డిగ్రీ పట్టాలు పొంది ఓటు నమోదు చేసుకున్నవారు, విద్య బోధ నేతర శాఖలలో విధులు నిర్వహిస్తున్నవారు, తమ ఉద్యోగ ప్రమోషన్ల కోసం ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలు పొందినవారు, ఇతర రాష్ట్రాల డిగ్రీలు, పీజీలు పట్టాలు పొందినవారు, ఎమ్మెల్సీ ఎన్నికల లో ఓటింగ్ విధానంపై వారికి అవగాహన లేదని వారు చెబుతున్న మాటలు.

కొంతమంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలలో ఓటు ఎలా వేయాలి ? నా పెన్ను వాడవచ్చా ? రైట్ టిక్ పేడితే సరిపోతుందా ? అంటూ తమను అడిగారు అని విధులు నిర్వహించిన పోలింగ్ అధికారులు చెపుతున్న మాటలు. అయితే ఎన్నికల నిబంధనల మేరకు తాము మౌనంగా ఉన్నాము తప్ప ఇలా అని చెప్పే పరిస్థితి లేదు అన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఏజెంట్లుగా ఉన్నవారు సైతం ఇవే మాటలు వివరిస్తున్నారు.

👉 వారి మాటలు వాస్తవానికి దగ్గరగా…?

👉 ఓటింగ్ విధానం ఒక్కటే..


పట్టబద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసే విధానం ఒకటే, అయినా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లుబాటు కానీ ఓట్ల సంఖ్య వెయ్యిలోపే (897)ఉన్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ జిల్లాల పరిధిలో ఉపాధ్యాయులు నమోదు చేసుకున్న మొత్తం ఓట్లు 27.088
పోలైన ఓట్లు 24,968, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 73 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లు 25,041, మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు


గెలిచిన అభ్యర్థి మల్కా కొమురయ్యకు 12,959 మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం సాధించారు. వంగ మహేందర్ రెడ్డి కి 7,182.
మరో స్వతంత్ర అభ్యర్థి అశోక్ 2621 ఓట్లు సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోతం రెడ్డి కి 428 ఓట్లు పోలయ్యాయి. పోలైన దాదాపు 25 వేల ఓట్లలో చెల్లుబాటు కానీ ఓట్లు 897 కావడం గమన హారం !

👉 పట్టభద్రుల ఎన్నికల లో చెల్లుబాటు కానీ ఓట్లు 40 వేలు కాకపోవచ్చు ?

👉 ఇప్పటివరకు 2 లక్షల 10 వేల ఓట్లను లెక్కించారు .

👉 ఇందులో సుమారు 21 వేల ఓట్లు( in చెల్లుబాటు కాలేదు.

👉 సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి.

👉 మరో 40 వేల ఓట్లు ప్రాథమిక లెక్కింపు, విభజన చేయాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా..
నూతనంగా డిగ్రీ పట్టాలు పొంది, ఓటర్ లిస్ట్ లో నమోదు చేసుకున్న నిరుద్యోగ, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగం చేసేవారు ఓటింగ్ తీరుపై అవగాహన లేక మొదటిసారి వేసిన ఓట్లే చెల్లుబాటు కానీ మెజార్టీ ఓట్లు కావచ్చు అనేది చర్చ.