మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి అసెంబ్లీ పరిధి పెగడపెల్లి మండలం బతికపెల్లి గ్రామానికి చెందిన  మృతుల కుటుంబ సభ్యులను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఓదార్చారు.


ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో  సర్వర్ పాషా, జాకిర్ పాషా లు మృతి చెందారు. ప్రభుత్వపరంగా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులకు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.


👉 బుగ్గారంలో భూమి పూజ..


బుగ్గారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం కు  ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భూమి పూజ చేశారు.


👉 బాక్స్ క్రికెట్ ప్రారంభం..


జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ అమిగో బాక్స్ క్రికెట్ ‘ ను ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా  యాజమాన్యానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.