నక్సల్ ఉద్యమంలో…తరతరాల తరాలపల్లి !


👉 ఆ గ్రామానికి చెందిన 8 మంది మృతి !


J.SURENDER KUMAR,


ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతేవాడ-బీజాపూర్‌ సరిహద్దుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు(డీకేఎస్‌జడ్‌ఎం) సుధీర్‌ అలియాస్‌ సుధాకర్‌ అలియాస్‌ మురళితో వరంగల్ జిల్లా తరాలపల్లిలో మొత్తం 8 మంది నక్సల్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు.


  సుధాకర్ తో పాటు ఆయన అంగరక్షకులు ఎస్‌జడ్‌ఎంలు మన్ను బార్సా, పండరూ అతర్‌ ఉన్నట్లు పోలీస్‌ అధికారులు వెల్లడించారు. సుధాకర్‌ తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఇతడిపై ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ₹ 25 లక్షల రివార్డు ప్రకటించింది.


👉 తరాలపల్లి  నుంచి అజ్ఞాతంలోకి వెళ్లి ఎన్కౌంటర్లో మృతి చెందిన వారు


వేల్పుల ఉప్పులయ్య  @ జగదీష్, బండి ఆచాన్న @ శ్రీనివాస, బైరి సదానందం  @ కౌముది, గాజుల శ్రీనివాస్ @ చిన్న, ముప్పిడి నాగేశ్వరరావు @ విశ్వనాథ్, పేరాల సంపత్ @ చిన్న, కొత్తపల్లి సాంబయ్య @ ఉప్పలయ్య,
అంకిసర సారయ్య @ సుధాకర్ తో మొత్తం 8 మంది మృతి చెందారు.