J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం పవిత్ర గోదావరి నది తీరంలో శ్రీ మఠం మైదాన ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కళ్యాణ వేదికపై అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం జరగనున్నది.

వేలాదిమంది సామాన్య భక్తజనం కనులారా, తొక్కి సలాట లేకుండా తనివి తీర స్వామి వారి కళ్యాణం తిలకించడానికి ఆలయ పక్షాన గత పది రోజులుగా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు. వేద పండితులు, అర్చకులతో ఆగమ శాస్త్ర ప్రకారం స్థల శుద్ధి, పుణ్యా వచనం తదితర ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక గ్యాలరీలు, ఎల్ఈడి లు. వేద పండితులకు, కళ్యాణ్ ప్రసాద వితరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అంబులెన్స్ ఫైర్ ఇంజన్ సేవలను అందుబాటులో ఉంచారు.

భక్తుల సౌకర్యార్థం అదనపు ఆలయ సిబ్బందిని నియమించారు. కళ్యాణ మహోత్సవం తిలకించడానికి తరలివచ్చే భక్తుల రాక అంచనాలకు మించి గ్యాలరీలు ఏర్పాటు చేశారు. విఐపి లో ఎంట్రీ ఎగ్జిట్ ద్వారాలు. వాహనాల పార్కింగ్, తదితరు ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణలో కొనసాగుతున్నది.
👉 మంత్రులు రాక..
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఉమ్మడి జిల్లా శాసనసభ్యులను , ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులను, మాజీ మంత్రులను, శాసనసభ్యులను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.