👉 మార్చి 10 నుండి 22 వరకు…..
👉 మార్చి 11 మంగళవారం…శ్రీ మఠం పీఠాధిపతి కి చెందిన 4 ఎకరాల విశాలమైన మైదానంలో సాయంత్రం నరసింహుడి కళ్యాణం జరగనున్నది !
J. SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు సోమవారం నుండి ( ఈనెల 10 నుండి ) ఆరంభం కానున్నాయి. దాదాపు 12 రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలు మార్చి 22 న ముగియనున్నాయి.
తెలుగు రాష్ట్రాల తో పాటు మహారాష్ట్ర, చత్తీస్గడ్ , కర్ణాటక ,ఇతర ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తజనం స్వామివారి జాతర ఉత్సవాల లో పాల్గొనడానికి తరలివస్తుంటారు.
ఈ ఉత్సవాలలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ( యోగ, ఉగ్ర ) ల తో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి, సైతం జాతర ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తోంది .
లక్షలాది భక్తజనం తరలి రానున్న ఈ జాతర ఉత్సవాల సందర్భంగా ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ జి సత్య ప్రసాద్ దేవస్థాన అధికారులు, భక్తుల సౌకర్యార్థం, భారీ ఏర్పాట్ల కోసం ముందస్తుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆయా శాఖల, అధికారులకు బాధ్యతలను అప్పగించారు.

తాగునీటి, వైద్యం, వసతి కల్పన, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు, నిరంతర విద్యుత్తు, అన్నదానం, తదితర అంశాలతో పాటు ఆలయ సుందరీకరణ, క్యూలైన్లు ఏర్పాటు, ప్రత్యేక ఆర్టీసీ బస్సు, సౌకర్యాలు తదితర ఏర్పాటు పట్ల ప్రత్యేక కార్యాచరణ యంత్రాంగం సిద్ధం చేసింది. స్థానిక మున్సిపల్ యంత్రాంగం, పారిశుద్ధ్య పనులను వారం రోజుల ముందు నుంచి ముమ్మరం చేశారు.
👉 జాతరలో ప్రధాన ఉత్సవాలు !
స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర పాల్గుణ శుద్ధ నవమి రోజున అనగా 10-03-2025 నుండి 22 -03 – 2025 వరకు ( 12 రోజులపాటు ప్రధాన ఉత్సవాలు జరగనున్నాయి )
👉 10-3-2025 సోమవారం….
స్వస్తిశ్రీ క్రోది నామా సంవత్సరం పాల్గొన శుద్ధ ఏకాదశి 11-00 గంటలకు అంకురార్పణ, కలశ స్థాపన, వరాహ తీర్థము, పుట్ట బంగారం.!
👉 11 న మంగళవారం…
సాయంత్రం గోధూళి సుముహూర్తాన , శ్రీ స్వామి వారు ల కళ్యాణం. . (నూతన కళ్యాణ వేదికపై )
👉 14 న శుక్రవారం…
శ్రీ యోగా నరసింహ వారి తెప్పోత్సవం, డోలోత్సవం, ( బ్రహ్మ పుష్కరిణిలో )
👉 15 న శనివారం….
శ్రీ ఉగ్ర నరసింహ వారి తెప్పోత్సవము, డోలోత్సవం ( బ్రహ్మ పుష్కరిణి లో )
👉 16 న ఆదివారం…..
శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవము, డోలోత్సవం ( బ్రహ్మ పుష్కరిణిలో ).
👉 19 న బుధవారం…
శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి రథోత్సవం ( క్షేత్ర పురవీధులలో ) జరగనున్న ప్రధాన జాతర ఉత్సవాలు…
ఈ సందర్భంగా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, గోదావరి నది తీరంలో పోలీస్ పికెటింగ్, గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. ముగ్గురు స్వామివార్లకు పుష్పయాగం, చక్రతీర్థం, ఉత్తర దక్షిణ, దిగ్విజయ యాత్రలు, తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి.

👉 జాతర ఉత్సవాలలో.. …
తేదీ 10-03-2025 నుండి 22-03-2025 వరకు శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణం, నిత్య నరసింహ హోమము, ఉండవు అని ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.