నియోజకవర్గంలో తాగునీటి సమస్య రావద్దు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశం !

J.SURENDER KUMAR,

వేసవిలో మంథని నియోజక వర్గంలో మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని,  అధికారులు గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి సమస్యరాకుండా  చూడాలని  రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.

గురువారం కాటారం  సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు  మాట్లాడుతూ..

వేసవిని దృష్టిలో ఉంచుకొని కాటారం, భూపాలపల్లి డివిజన్ లలో మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

👉 అధికారులు గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. 

👉 సబ్ డివిజన్ పరిధిలో 30 బోర్లు నిర్మానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని అవసరం ఉన్న గ్రామాలలో ఏర్పాటు చేయాలని తెలిపారు.

👉 కాటారం సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో మినీ స్టేడియం, చిల్డ్రన్ పార్కు నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టాలని తెలిపారు.

👉 నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని  తెలిపారు.

👉 గ్రామాలలో సోలార్ పవర్ ద్వారా నీటి మోటార్ల ఏర్పాటుకు ప్రతి పాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

👉 సి.ఆర్.ఆర్ ద్వారా  ఉట్ల పోచమ్మ , దామర కుంట నుండి మానేరుకు   వెళ్ళే రోడ్డు, ఒడుపులవంచ గ్రామాలలో నాలుగు రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని వాటి నిర్మాణ పనులను వెంటనే  చేపట్టాలని స్పష్టం చేశారు.

 

👉 ఏ.సి.డి.పి నిధుల ద్వారా నిర్మాణంలో ఉన్న  పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కాటరం సబ్ డివిజన్ కేంద్రంలో మంజూరు చేసిన కూరగాయల మార్కెట్, కమ్యూనిటీ హాలు నిర్మాణాలను టెండర్లను పిలిచి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.

👉 కాటారం సబ్ డివిజన్ కు అంబులెన్సు, వైకుంఠ రథాలు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని వెంటనే ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు .

👉 కాటారం సబ్ డివిజన్ కేంద్రం, మహదేవ్ పూర్ మండల కేంద్రాల్లో  ఆర్.టి.సి బస్టాండ్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు  పంపాలని ఆదేశించారు.

👉 చిన్న కాళేశ్వరం !

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని చెరువుల నిర్మాణం పనులు భూసేకరణ త్వరిత గతిన పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.

👉 ఇసుక లారీల తో !

ఇసుక లారీల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇసుక లారీలు అతి వేగాన్ని నిర్మూలించాలని విడియో కెమెరాలు, స్పీడ్ గన్స్, ప్రత్యేక చెక్ పోస్టులు , పార్కింగ్ ఏరియలు ఏర్పాటు చేయాలని లారీలు రోడ్డు పై ఓవర్ టేకింగ్ చేయకుండా చూడాలని తనిఖీలు చేపట్టాలని టీజిఎంఐడిసి అధికారులతో కోఆర్డినేషన్ తో ఏరోజు పర్మిషన్ ఇచ్చిన లారీలను ఆ రోజు మాత్రమే పార్కింగ్ లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని  రహదారి పై రోడ్డు  ప్రమాదాలు జరగకుండా చూడాలని పోలిస్ శాఖ ను ఆదేశించారు.

👉 సరస్వతి పుష్కరాలు !

సరస్వతి పుష్కరాలు గురించి మాట్లాడుతూ భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేయాలని నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం నాణ్యత పాటిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పుష్కరాల సమయానికి అందుబాటులోకి తేవాలని మంత్రి శ్రీధర్ బాబు  ఆదేశించారు.


ఈ సమావేశంలో రాష్ర్ట ట్రేడ్ కార్పొరేషన్   ఛైర్మెన్ అయితా ప్రకాశ్ రెడ్డి, ఎస్పీ కిరణ్ ఖరె, సబ్ కలెక్టర్ మయంక్ సింగ్, డిఆర్డిఓ నరేష్, డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.