J.SURENDER KUMAR,
రాయపట్నం కరీంనగర్ రహదారి రోడ్డు మరమ్మతు పనులలో ప్రమాణాలు పాటించేలా పనులు చేపట్టాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు.
ధర్మారం మండల పర్యటన ముగించుకొని ధర్మపురి వెళ్తున్న ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మార్గం మధ్యలో వెల్గటూర్ నుండి రాయపట్నం వరకు గల ప్రధాన రహదారి పైన ₹ 4 కోట్ల రూపాయలతో జరుగుతున్న రోడ్డు ప్యాచ్ పనులను సోమవారం పరిశీలించారు.

అనంతరం సంబంధిత జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్యాచ్ వర్క్స్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పనులు పూర్తి అయ్యే వరకు అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పగలు రాత్రి అగు పించేలా ప్రమాద సూచికల బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
👉 మల్లన్న స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే !

గొల్లపల్లి మండలం తిర్మలాపుర్ గ్రామంలోనీ శ్రీ స్వయంభూ గుండు మల్లన్న స్వామి నీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను అర్చకులు సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అనంతరం తిర్మలాపూర్ పిడి రైతు పరస్పర సహాయ సహకార సంఘ నూతన భవనాన్ని మండల నాయకులతో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ధర్మరం కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాయిబాబా మెడికల్ ను ప్రారంభించి యాజమాన్యానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.