👉 జగిత్యాల సిసిఎస్ ఎస్ఐ చిందులు !
👉 ధర్మపురి జాతరలో ….
J.SURENDER KUMAR,
పేపర్లో రాస్తే ఏమైతది ? ఒకరోజు చూస్తారు, నేను రిజెండర్ ఇస్తా, నాకు ఎడిటర్ లు తెలుసు ( ఓ ప్రముఖ ఎడిటర్ పేరు ఉచ్చరిస్తూ ) నాకు రూల్స్ మా ఎస్పి చెప్పాలి, అంటూ జగిత్యాల్ సిసిఎస్ ఎస్ఐ రవీందర్ ధర్మపురి జాతరలో భక్తుల ముందు చిందులు తొక్కుతూ ఆయన నోట వెలువడిన మాటలు ఇవి..
వివరాలు ఇలా ఉన్నాయి..
జాతర ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి డోలోత్సవం త్తిలకించడానికి శ్రీ స్వామి వారు కోనేటిలోకి వచ్చే ద్వారం గుండా స్థానికులు, వృద్ధులు, దివ్యాంగులు మండపంలో ఉన్న స్వామివారి దర్శనంకు వెళుతుంటారు. గత రెండు రోజులుగా అక్కడ విధులు నిర్వహించే పోలీస్ అధికారులు భక్తులతో ఫ్రెండ్లీగా భక్తులను అనుమతించడంతో ప్రశాంతంగా దర్శించుకున్నారు.
ఆదివారం స్వామివారు పోలీస్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో స్థానిక పోలీసులు, నియోజకవర్గ పరిధిలోని ఎస్ ఐలు స్టేషన్ కు వెళ్లారు. ఈ ద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్న సిసిఎస్ ఎస్ఐ రవీందర్ మాత్రం భక్తులపై అసహనం వ్యక్తం చేస్తూ తనకు 35 ఏళ్ల సర్వీస్ అనుభవం ఉందని, లక్షకు పైగా జీతం వస్తుందని, సమయం సందర్భం లేకుండా భక్తులతో వాదనకు దిగారు. ఆలయ ఉద్యోగి ఒకరు సర్ వాళ్ళు స్థానికులు, పాత్రికేయులు అంటూ వివరించినా, నాకు రూల్ పొజిషన్ తెలుసు, పోలీస్ అధికారులను ( కీలక పోలీస్ అధికారి హోదాను ఉచ్చరిస్తూ ) వారితో ఆదేశాలు జారీ చేయించండి, నేను ఎవరిని ఈ దారి గుండా వదిలే ప్రసక్తి లేదు అంటూ భక్తుల, జర్నలిస్టుల ముందు ఆయన మాటలు ఇవి.
కొందరు భక్తులు ఎస్సై ప్రవర్తన తీరు ను ఫోన్ ద్వారా పోలీసు అధికారులకు వివరించారు. విధి లేని పరిస్థితుల్లో ఎస్పీ కార్యాలయానికి ఫోన్ చేశారు.
👉 ఎస్సై కి రూల్ పొజిషన్ తెలుసా ?
ఎస్సై విధులు నిర్వహించే ద్వారం వద్ద బారి కేట్లను ఏర్పాటుచేసి బందోబస్తు కు పోలీసులను నియమించారు అంటే భక్తుల రాకపోకలను ప్రశాంతంగా కొనసాగడానికి అనేది మాత్రం ప్రజలకు తెలిసిన రూల్ పొజిషన్. దీనికి తోడు స్థానికేతర పోలీసులు ఇలాంటి విధులు నిర్వహిస్తున్న సందర్భంలో స్థానిక పోలీస్ గానీ, హోంగార్డు ను అక్కడ విధులు నిర్వహించే అధికారికి అతడికి గైడ్ గా ( సహాయకుడిగా ) ఉంటాడు అనేది రూల్ పొజిషన్.
అయితే ఎస్ ఐ ఈ రూల్ పొజిషన్ విస్మరించి ఎలా విధులు నిర్వహించాడో ? ఆ ద్వారం గుండా భక్తుల దర్శనాలకు అనుమతి లేకుంటే అక్కడ పోలీస్ బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేస్తారో ? రూల్ పొజిషన్ ఏమిటో ? ద్వారంకు అడ్డంగా భారీకేడ్లు ఎందుకు ఏర్పాటు చేయలేదో ? క్రమశిక్షణ గల పోలీస్ శాఖలో భక్తుల ముందు ఆసందర్భంగా మాట్లాడిన ఎస్సై కి ఈ రూల్ పొజిషన్ తెలియదా ? ఇక్కడ గైడ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు అని పోలీస్ ఉన్నతాధికారులను వివరణ కోరుతాడు కాబోలు !
ఇది ఇలా ఉండగా జగిత్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రజలతో, నిరుద్యోగ యువతతో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూ, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోలీస్ శాఖ పక్షాన అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ గంజాయి నియంత్రణకు, ఉద్యోగాల పేరుతో యువతను మోసగిస్తున్న ఏజెంట్ లమోసాలపై ఉక్కు పాదం మోపుతూ జిల్లా ప్రజల, యువకుల , విద్యావేత్తల ప్రశంసలు పొందుతున్న పోలీస్ యంత్రాంగం ఆదివారం చిందులు తొక్కిన సిసిఎస్ ఎస్సై తీరుపై నిఘ వర్గాలతో విచారణ జరిపిస్తారో ? వివరణ కోరుతారో ? అని ప్రజలు వేచి చూస్తున్నారు !