పార్టీ అధ్యక్షునిగా అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు పోరాటం చేస్తా !

👉 జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చే ప్రతి ఆదేశాల మేరకు నేను కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు కలిసికట్టుగా పోరాటం చేస్తామని, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు .
హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.


ఎమ్మెల్యే సమావేశంలో మాట్లాడుతూ…


ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హేళనగా మాట్లాడిన సందర్భంగా ఈరోజు జరుగుతున్న జైబాపు, జై భీమ్ జై సమ్మిదాన్ అనే నినాదంతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కారణం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ తోనే తెలంగాణ రాస్తూ ఏర్పడింది అన్నారు.

అంతటి గొప్ప మహనీయుని అవమానపరిచిన అమిత్ షా ను భర్తరఫ్ చేయాలని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చే ప్రతి ఆదేశాలకు అనుగుణంగా నేను పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలతో కలిసి పోరాటాలు, ఆందోళనలు, చేస్తానని లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.