👉 జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ !
J.SURENDER KUMAR,
పవిత్ర రంజాన్ పవిత్ర మాసం సమాజంలో ఒకరినొకరు గౌరవించుకు నే సంస్కృతి స్ఫూర్తిని, సహనం, సహాయ సహకారాలను పెంపొందించే గొప్ప మాసం రంజాన్ జగిత్యాల కలెక్టర్ బి సత్య ప్రసాద్ అన్నారు.

జగిత్యాల జిల్లాలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ సత్యప్రసాద్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్, జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, అదనపు కలెక్టర్ బి.ఎస్. లత తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇఫ్తార్ విందుల వంటి కార్యక్రమాలు సామాజిక సమైక్యతకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత , ఆర్డీవో శ్రీనివాస్ , కలెక్టరేట్ పరిపాలన అధికారి హకీమ్ TRESA అధ్యక్షుడు ఎండి వకీల్, TNGO జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు మరియు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.