పోలీస్ డాగ్స్ కెన్నెల్కె రూమ్స్ ప్రారంభించిన కలెక్టర్ !

J.SURENDER KUMAR,


జగిత్యాల పట్టణంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డాగ్స్ కెన్నెల్కె రూమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
బుధవారం రోజున జగిత్యాల పట్టణంలోని జిల్లా పోలీస్ పరేడ్ మైదానం లో పోలీస్ శాఖ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.


ముందుగా కలెక్టర్ పోలీస్ తో గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ జగిత్యాల ( Police Dogs ) నేర పరిశోధన, భద్రతా చర్యలు, మాదకద్రవ్యాల నియంత్రణ, మరియు విపత్తు పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయిని, శిక్షణా సామర్థ్యం వల్ల పోలీసులు విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నారని అన్నారు.


పోలీస్ జగిత్యాల ఇంతకు ముందు SRSP క్వార్టర్స్ లో ఉండేది అక్కడ సరైన వసతులు లేవని జిల్లా ఎస్పీ మా యొక్క దృష్టికి తీసుకురావడం జరిగిందని. వీటికి శాశ్వతంగా గదులను కేటాయించాలని ఉద్దేశంతో వీటిని ప్రారంభించడం జరిగింది అని అన్నారు.


జగిత్యాల నేరాల నిరోధం, విచారణ మరియు భద్రతాపరమైన చర్యల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. వీటి అధిక సామర్థ్యం, విశ్వసనీయత మరియు ప్రత్యేక శిక్షణ కారణంగా పోలీస్ కు ఎంతగానో సహాయపడతాయి అని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను ఎస్పీ అశోక్ కుమార్ ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో, ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.