ప్రభుత్వ న్యాయవాదిగా ఇమ్మడి శ్రీనివాస్ !

J.SURENDER KUMAR,


ధర్మపురి పట్టణం కాసెట్టి వాడకు చెందిన ఇమ్మడి శ్రీనివాస్ ను తెలంగాణ ప్రభుత్వం ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయస్థానంలో అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాది గా నియమించింది.


ధర్మపురి ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. పదవ తరగతి పరీక్షల హాజరుకావడానికి హాజరు శాతం తక్కువగా ఉందని అప్పటి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పదవ తరగతి పరీక్షలకు హాజరు కావడానికి అనుమతి నిరాకరిస్తూ  హాల్ టికెట్ ఇవ్వడానికి నిరాకరించాడు.


ఈ మేరకు శ్రీనివాస్ తాను పదవ తరగతి పరీక్షలు రాయడానికి ప్రధానోపాధ్యాయుడు హాల్ టికెట్ ఇవ్వడంలేదని ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు న్యాయమూర్తి హాజరు శాతం తక్కువగా ఉందని ఏ విద్యార్థి కి హాల్ టికెట్ ఇవ్వకపోవడాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తూ,  ఈ కారణంతో రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ జారీ చేయకపోవడం దారుణమని సంచలన తీర్పు ఇచ్చింది.


ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి  సందర్భాలలో  యుద్ధ ప్రాతిపదికన విద్యార్థులకు హాల్ టికెట్స్ విద్యార్థులకుఇవ్వాలని సంచలన తీర్పు ఇచ్చింది.  ఈ తీర్పు ప్రతిని వైర్ మెసేజ్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లకు, డీఈఓ లకు,  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు జోక్యంతో పదవ తరగతి పరీక్షలకు హాజరైన శ్రీనివాస్ పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించారు.


కొంతకాలం ప్రైవేట్ విద్యాసంస్థలలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తూ లా పూర్తి చేశారు.  స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్  లక్ష్మణ్ కుమార్, సిఫారసు మేరకు నిబంధనల మేరకు ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి శ్రీనివాస్ ను అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదిగా నియమించింది. శ్రీనివాస్ గురువారం  విధుల్లో చేరారు.