ప్రభుత్వ భూముల ఆక్రమణ పట్టాల రద్దు !

👉 జగిత్యాల జిల్లాలో 90.20 ఎకరాల స్వాధీనం !


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా కేంద్రం సమీప నర్సింగాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూములకు అక్ర మంగా పట్టాలు చేయించుకున్న వారి పట్టాలను ప్రభుత్వం రద్దు చేసింది.
15 మందికి చెందిన 90.20 ఎక రాలకు సంబంధించిన పట్టాలను రద్దు చేశారు. నర్సింగా పూర్ ప్రభుత్వ భూముల ఆక్రమణల బాగోతంపై ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి  జనవరిలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. 

తహసీల్దారు శ్రీనివాస్ విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందజే శారు. పట్టణంలో పలుకుబడి ఉన్న పలువురు ధరణిలో పేరు మార్పించుకొని పట్టాలు పొందినట్లు తేలడం తో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి  ఆదే శించడంతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి కలెక్టర్ సత్యప్రసాద్ కు నివేదిక అందించారు.

కలెక్టర్ ఆదే శాలతో సర్వే నంబరు 437లోని 71.13 ఎకరాలు.. 251 సర్వే నంబరులో 19.07 ఎకరాలకు సంబంధించి పట్టాలు రద్దు చేసి ప్రభుత్వ భూమిగా నమోదు చేసినట్లు తహసీ ల్దారు శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


మరోవైపు ఈ సర్వే నంబర్లలోనే గతంలో మరికొంత భూమిని ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది. అందులో ఓ ముగ్గురు 3.15 ఎకరాల భూమిని స్వచ్చందంగా ప్రభు త్వానికి తిరిగి అప్పగించినట్లు తహసీల్దారు పేర్కొన్నారు.


👉 రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు ?
ప్రభుత్వ భూములు అక్రమంగా ఇతరుల పేరున
పట్టాలు చేసి ధరణిలో మార్పులు చేర్పులు చేసిన నాటి బాధ్యులైన రెవెన్యూ అధికారులపై రెవెన్యూ ఇంటిలిజెన్సీ, ఏసీబీ అధికారులతో విచారణకు ఆదేశించాలని కోరుతూ మంగళవారం రాత్రి ఉమ్మడి జిల్లాకు చెందిన  ప్రజా ప్రతినిధి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

ఫిర్యాదు పత్రంతో పాటు కలెక్టర్ సత్యప్రసాద్ తీసుకున్న చర్యల నివేదిక  సీఎంవో కార్యాలయంకు చేరినట్టు తెలిసింది