ప్రభుత్వం పక్షాన తలంబ్రాలు సమర్పించిన కలెక్టర్ దంపతులు !


J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి జగిత్యాల కలెక్టర్ బి సత్యప్రసాద్ దంపతులు ప్రభుత్వం పక్షాన మంగళవారం తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించారు.


శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ యోగ, శ్రీ ఉగ్ర, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనున్నది.

ప్రభుత్వం నుండి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, తెస్తున్న కలెక్టర్ దంపతులను స్థానిక ఇసుక స్తంభం నుండి ఆలయం వరకు మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు స్వాగతించారు.

అనంతరం కలెక్టర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులను వేద మంత్రాలతో ఘనంగా ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రసాదం అందించారు.


👉 అన్నదానం ప్రారంభించిన ప్రభుత్వ విప్ కలెక్టర్ !

బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే వేలాదిమంది భక్తజనంకు స్థానిక ఓల్డ్ టీటీడీ ధర్మశాల లో రైస్ మిల్ యజమానులు, వర్తకులు, దాతల ఆధ్వర్యంలో 13 రోజులపాటు ఉచిత అన్నదానం నిర్వహిస్తారు.

ఈ అన్నదానం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ బి సత్యప్రసాద్ టెంకాయ కొట్టి ప్రారంభించారు.

అనంతరం భక్తులతో కలిసి భోజనం చేశారు. శ్రీ మఠం మైదానంలో నిర్వహించనున్న కళ్యాణ వేదికను కలెక్టర్, సత్య ప్రసాద్, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు.