👉 48 గంటల డెడ్ లైన్ లేకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం కలెక్టర్ హెచ్చరిక !
J.SURENDER KUMAR,
ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ స్థలంలోని ఇటుక బట్టీలు ఖాళీ చేయాలి అని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. 48 గంటల డెడ్ లైన్ లేకుంటే వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం అని కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు.
👉 జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఆక్రమణకు గురి అయిన 90,ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సంబంధిత అధికారులతో కలసి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
👉 ప్రభుత్వ స్థలాన్ని సందర్శించి సర్వే నెంబర్లు వ్యూ పాయింట్స్ చెక్ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

👉 జగిత్యాల జిల్లా రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 251, 437, సర్వే నెంబర్ కు సంబంధించి 90,ఎకరాల్లో ప్రభుత్వ అసైన్ ల్యాండ్ కు సంబంధించిన సర్వే చేపట్టడం జరిగింది. సర్వే తర్వాత ఏవైతే పట్ట అయినా భూములు ఉన్నాయో అవి అన్నీ కూడా పి ఓ టి యాక్ట్ క్రింద క్యాన్సల్ చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు.
👉 ఏవైతే సెల్ అయి రిజిస్ట్రేషన్ అయినవి ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందని అన్నారు. కావున 90, ఎకరాల్లో ప్రభుత్వ స్థలంలో ని సర్వేనెంబర్ 437,251, లో ఆన్ రికార్డు పరంగా గవర్నమెంట్ రికవరీ చేసుకుంది.
👉 ప్రభుత్వం పరంగా గవర్నమెంట్ ల్యాండ్ జాబితాలో ఉంది అని అన్నారు.ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వారికి రిజిస్ట్రేషన్ అనేది కాదు అని అన్నారు.
👉 అంతా కూడా ప్రభుత్వ రికార్డ్ జాబితాలో ఉందని అన్నారు. గ్రౌండ్ లెవెల్లో మొత్తం అంత పరిశీలించడం జరిగింది.
👉 ముందుగా ఎవరైతే స్థలం కొన్నవారు, ఇతరులకు అమ్ముకోవడం అనేది జరిగింది. వాళ్లు ఇక్కడ ఇటుక బట్టి వ్యాపారం చేయడం అంతా కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది వాళ్లకి ప్రభుత్వం పరంగా వాళ్లందరికీ ఇదివరకే వార్నింగ్ ఇవ్వడం జరిగిందన్నారు.
👉 లాస్ట్ వార్నింగ్ ఇచ్చి వారందరికీ 48 గంటల లోపు ప్రభుత్వ స్థలంలో ఉన్న అంతా కూడా క్లియర్ చేయమని ఆదేశాలు జారీ చేశారు.
👉 లేనియెడల ప్రభుత్వ పి ఓ టి యాక్ట్ ప్రకారం ప్రభుత్వ స్థలంలో వారు వ్యాపారాలు చేసుకున్నందుకు గాను వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తం లేదంటే అంతా జప్తు చేసుకొని సీజు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు.
కలెక్టర్ వెంట ఇన్చార్జి ఆర్డీవో శ్రీనివాస్ ఎమ్మార్వో , శ్రీనివాస్ రూరల్ మండల్ డి ఐ ఓ ల్యాండ్ సర్వే ర్ విఠల్ మండల్ సర్వేర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.