👉 పాలకవర్గ అధ్యక్షుడిగా జక్కు రవీందర్ !
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయా పాలకవర్గ సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో పాలకవర్గ సభ్యులు, ఎదులపురం మహేందర్,. బాదినేని వెంకటేష్ , .బొల్లారపు పోచన్న, గుడ్ల రవీందర్, జక్కు రవీందర్, .కొమురెల్లి పవన్ కుమార్, మందుల్ల మల్లేష్ , నేదునూరి శ్రీధర్ ,.రాపర్తి సాయికిరణ్ , సంబేట తిరుపతి , స్థంబంకాడి గణేష్ కుమార్ , వొజ్జల సౌజన్య , అవ్వ సుధాకర్ ల తో ప్రమాణస్వీకారం చేశారు

అనంతరం పాలకవర్గ సభ్యులు జక్కు రవీందర్ ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కాంగ్రెస్, ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులు పాలకవర్గాన్ని పూలమాలలు, శాలువల తో సన్మానించారు.