రేపు ధర్మపురి అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి అభినందన సభ !

👉 బీసీ & ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన సందర్భంగా ..
👉 ఎండపల్లి మండలంలో..

J.SURENDER KUMAR,


ధర్మపురి అసెంబ్లీ పరిధిలో ఎండపల్లి మండలం రాజారాం పల్లె లో ఆదివారం  సీఎం రేవంత్ రెడ్డి అభినందన సభ నిర్వహించనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటనలో తెలిపారు


బీసీ & ఎస్సీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అభినందన సభ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

👉 రాజారాంపల్లి లోని స్థానిక SR గార్డెన్ లో ఈనెల.23.న ఆదివారం  ఉదయం 10 గంటలకు అభినందన సభ జరగనున్నది.

నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి ఎస్సీలు మరియు బీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందన సభ కార్యక్రమాన్ని  విజయవంతం  చేయాలని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ శ్రేణులకు, బీసీ, ఎస్సీ ,ఎస్టీ  నాయకులకు విజ్ఞప్తి చేశారు.