రోజు భగవద్గీత శ్లోకాన్ని చదువుతాను మంత్రి శ్రీధర్ బాబు !

👉 మంథనిలో సామూహిక భగవద్గీత పారాయణం కార్యక్రమంలో…

👉 పాల్గొన్న రాష్ట్ర మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు !


J.SURENDER KUMAR,

గత కొన్ని సంవత్సరాలుగా మంథని లో భగవద్గీత పారాయణం  చేస్తూ చాలామందితో చేపిస్తున్న పార్వతీ టీచర్, నన్ను రోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదవాలని సూచించారని తప్పకుండా సమయం చూసుకొని భగవద్గీత శ్లోకాన్ని చదువుతున్నానని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు తెలిపారు.


పెద్దపల్లి జిల్లా మంథనిలోని శివకిరణ్ గార్డెన్ లో ఆదివారం జరిగిన  సామూహిక భగవద్గీత  పారాయణం కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వామీజీలను మంత్రి ఘనంగా సత్కరించారు.


భగవద్గీతలోని మూడు అధ్యాయాలు భక్తులతో కలసి  పారాయణం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ  ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.


ఈ కార్యక్రమంలో  మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొని భగవద్గీత విశిష్టత గూర్చి వివారించారు.


సామూహిక భగవద్గీత పారాయణం 5 వేల మందితో నిర్వహించిన సనాతన ధర్మ ప్రచార సమితికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లభించడంతో మంత్రి శ్రీధర్ బాబు జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని సనాతన ధర్మ ప్రచార కమిటీ సభ్యులకు అందజేశారు.


మంథనిలో క్రమం తప్పకుండా 665 రోజుల నుండి భగవద్గీత పారాయణం చేస్తున్నా వారిని ఈ సందర్భంగా మంత్రి శాలువాలతో సన్మానించి మెమెంటోలు బహుకరించారు.