J.SURENDER KUMAR ,
అకాల వర్షంతో పంతం పొలాలకు అపార నష్టం కలిగిందని, రైతాంగం ఎలాంటి ఆందోళన చందాల్సిన అవసరం లేదని నిబంధనల మేరకు ప్రభుత్వ పరంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

గత రెండు రోజుల క్రితం వడగళ్ల వానతో వలన మొక్కజొన్న పంట దాదాపు 2 వందల ఎకరాలకు పైగా నష్టం జరిగినట్టు అధికారుల నివేదిక మేరకు ఆదివారం బుగ్గారంలో ఎమ్మెల్యే రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడి పంట నష్ట నివేదికలు ప్రభుత్వానికి పరితగతిన అందించాలని ఆదేశించారు.

👉 రాయపట్నం లో…

వడగళ్ల వానతో ధర్మపురి మండలం రాయపట్నం గ్రామానికి చెందిన దాదాపు 14 వందల ఎకరాలకు పైగా వరి, ఇతర పంటలు నష్టం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.

రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు అనంతరం జిల్లా అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. పంట నష్ట వాటిలో ప్రతి రైతుకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందించి రైతులను ఆదుకుంటామని రైతులు ఆందోళనా చెందవద్దని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు.