👉 సీఎం అభినందన సభలో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఎస్సీ వర్గకరణను చట్ట సభలలో ఆమోదింపచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణం తీర్చుకోలేనిదని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
బీసీలకు రిజర్వేషన్ పెంపు, ఎస్సీ వర్గకరణను చట్ట సభల్లో ఆమోదించిన సంధర్బంగా ధర్మపురి అసెంబ్లీ పరిధి ఎండపెల్లి మండలం రాజారాంపల్లి లోని SR గార్డెన్ లో ఆదివారం నియోజకవర్గస్థాయి ఎస్సీ ఎస్టీ బీసీ కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రికి, పీసీసీ నాయకులకు, రాష్ట్ర మంత్రివర్గానికి ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభినందన సభకు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.

.
గత 30 సంవత్సరాలుగా ఎస్సి వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ని ఏర్పాటు చేసి రాజీలేని పోరాటం చేస్తున్నాడని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చట్టసభలలో చట్టం చేయని సాహసం కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి చేశాడని అన్నారు.
👉 తాను ఓడిన గెలిచిన ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉన్నానని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భిక్ష తోనే ఎమ్మెల్యే గా ప్రభుత్వ విప్ ఈ రోజు చట్టసభలలో మాట్లాడుతున్నానని అన్నారు.
👉 అసెంబ్లీలో తన ప్రసంగం పట్ల సిఎం రేవంత్ రెడ్డి అభినందించారు అని, దళితుల కష్టాలు నాకు తెలుసు కాబట్టే మాదిగ ఉప కులాల వర్గీకరణపై అసెంబ్లీలో 30 నుండి 35 నిమిషాలు ప్రసంగించానన్నారు.
👉 చేవెళ్లలో జరిగిన చేసిన ఎస్సి, ఎస్టీ డిక్లరేషన్ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఎస్సి వర్గీకరణకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.

👉 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిఎం వర్డీకరణ అంశంపైన అందరి అభిప్రాయాలను సీఎం తీసుకొని చట్టం చేశారన్నారు.
👉 నేనే రాజు, నేనే మంత్రి, అన్ని మేమే అని 10 సంవత్సరాలు రాజ్యం ఏలిన గత బీఆర్ఎస్ పాలకులు ఎందుకు ఎస్సి వర్గీకరణను చెయ్యలేదో సమాధానం చెప్పాలని, డిమాండ్ చేశారు.
👉 నియోజకవర్గ అభివృద్ధికి నేను ఎల్లవేళలా కట్టుబడి ఉన్నానని, పలు గ్రాంట్ ల ద్వారా గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలను ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న చెగ్యం ముంపు బాధితులకు ,₹ 18 కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించామన్నారు.
👉 గత ప్రభుత్వంలో ధర్మపురి లో మూతపడిన తెలుగు కళాశాలను పునఃప్రారంభం సాధ్యం కాదు అనే చేతులెత్తేసిన తిరిగి కళాశాల ప్రారంభించామన్నారు.

👉 ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఏర్పాటు తదితర సాగు తాగునీటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఈ వేదికపై అంబేద్కర్ సంఘ నాయకులు, ఎస్సీ యువకులు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో ఘనంగా సన్మానించారు.