స్కిల్స్ యూనివర్సిటీ, సిస్కో సంస్థకు మధ్య  ఒప్పందం !

👉 సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో..


J.SURENDER KUMAR,


సాంకేతిక రంగంలో దిగ్గజ సంస్థ సిస్కో(CISCO) నైపుణ్య శిక్షణ అందించడంలో తెలంగాణలోని ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తో కలిసి పనిచేయనుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  సమక్షంలో ఆ మేరకు స్కిల్స్ యూనివర్సిటీకి, సిస్కో సంస్థకు మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది.


అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు, సిస్కో సీనియర్ వైఎస్ ప్రసిడెంట్ డాక్టర్ గయ్ డీడ్రిక్ CISCO సంస్థ ఇతర ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది.


నైపుణ్య శిక్షణ అందించే విషయంలో ఈ సందర్బంగా సిస్కోకు స్కిల్స్ యూనివర్సిటీకి, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్  కు మధ్య వేర్వేరు ఒప్పందాలు కుదిరాయి. ఈ సమావేశంలో స్కిల్స్ యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు , టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా  పాల్గొన్నారు.


👉సీఎంను కలిసిన ఆస్ట్రేలియా హైకమిషనర్ !


ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా  పీటర్ మాలినాస్కస్ ఎంపీ  నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం తెలంగాణ అసెంబ్లీ కమిటీహాలులో బుధవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా హైకమిషనర్  ఫిలిప్ గ్రీన్ ఓఏఎం  , మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.